Sunday 22 December 2013

majjiga pulusu

కావలసిన పదార్థాలు

    పచ్చి కొబ్బరి: 1 చిప్ప
    పచ్చిమిరపకాయలు: 4 పెద్దవి
    అల్లం చిన్నముక్క
    ఆవాలు: ¼ టీస్పూ//
    కొత్తిమీర కొంచెం
    ధనియాలు: 1 టీస్పూ//
    శనగ పప్పు: 1 టీస్పూ// (ముందుగా నానబెట్టుకోవాలి)
    పసుపు చిటికెడు
    పై పదార్ధాలన్ని కలిపి మెత్తగా ముద్దలాగా చెసుకోవాలి. కొంచెం మజ్జిగ కూడా కలిపి పల్చగా రుబ్బుకోవాలి.
    చిక్కటి మజ్జిగ: 1/2 లీటరు
    ఉప్పు తగినంత
    కావలసిన కూరముక్కలు: బెండకాయ, ములక్కాడలు, క్యారెట్,సొరకాయ,టమాట,బచ్చలి కూర ఏదైన ఒకటి, లేక అన్నీ కూడా వేసుకోవచ్చు

తయారీ విధానం

ముందుగా కావలసిన కూరముక్కలని ఉప్పు లేకుండా ఉడికించుకోవాలి.

ఉడికిన కూరముక్కలు మిగిలిన మజ్జిగ, పైన రుబ్బుకున్న ముద్ద కలిపి 10 నిమిషాలు ఉడికనివ్వాలి.

స్టవ్ మీద నించి దించి కొంచెం చల్లరాక ఉప్పు వేసుకోవాలి.

స్టవ్ మీద వున్నప్పుడు లేదా వేడిగ వున్నప్పుడు ఉప్పు వేస్తె మజ్జిగ విరిగిపోయే ప్రమాదం వుంది.

ఒక మూకుడులో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఎండుమిరపకాయలు, తాజా కరివేపాకు పోపు వేసుకుని పై మజ్జిగ పులుసులో కలుపుకోవాలి.

0 comments:

Post a Comment

sent your idea's experience and your new recipe's that we will definitely publish ,thanks for visiting our site

Related Posts Plugin for WordPress, Blogger...